Site icon vidhaatha

Vande Bharat Metro Update | వందే మెట్రో తొలి రైలు పట్టాలెక్కేది ఈ మార్గంలోనే..! ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..?

Vande Bharat Metro Update |

భారతీయ రైల్వే సరికొత్త హంగులతో తీసుకువచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకువచ్చింది. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో వందే మెట్రోను నడిపేందుకు రైల్వే సన్నాహాలు చేస్తున్నది. అయితే, ఏ మార్గంలో వందే మెట్రోను ఏ మార్గంలో నడుపనున్నాదో, ఎప్పుడు పట్టాలెక్కనుందో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

ఇటీవల ఒడిశాలో కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒడిశాకు కేంద్రం మరో కానుకను ప్రకటించింది. పూరీ – భువనేశ్వర్‌ – కటక్‌ మధ్య వందే మెట్రో ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జనవరి – ఫిబ్రవరి మధ్య రైలు పట్టాలక్కె అవకాశాలున్నాయి.

వందే మెట్రో అంటే ఏమిటి?

వందే మెట్రో.. వందే భారత్‌ రైలు స్మాల్‌ వర్షన్‌. తక్కువ దూరంతో రెండు నగరాల మధ్య నడువనున్నది. 2023-24 బడ్జెట్‌లో రైలును కేంద్రం ప్రకటించింది. వంద కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న రెండు నగరాలను అనుసంధానించనున్నది. అత్యధిక జనాభా నివసించే పెద్ద నగరాలను ముంబయి, ఢిల్లీ తరహా నగరాల్లో 50-60 కిలోమీటర్ల మధ్య రైలును నడపాలని రైల్వేశాఖ భావిస్తున్నది.

వందే భారత్‌ తరహాలోనే మెట్రోను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రైలులో ప్రయాణికులకు ప్రీమియం లోకల్‌ రైలు సౌకర్యం కల్పించేందుకు రైల్వే ప్రయత్నాలు చేస్తున్నది. ప్రధాన నగరాల్లో పని చేసేవారికి, ప్రతి రోజు సమీపంలోని నగరాల నుంచి పెద్ద నగరాలకు పని కోసం వచ్చే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని రైల్వేశాఖ భావిస్తున్నది.

ఆయా రైళ్లలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించనున్నాయి. ఇటీవల పలు నగరాల్లో సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రారంభించిన సమయంలో వందే మెట్రోపై కేంద్రమంతి ప్రకటన చేశారు. మెట్రో తక్కువ దూరం మెట్రో రైలు నెట్‌వర్క్‌లో నడుస్తుందని పేర్కొన్నారు.

వందే మెట్రో ప్రత్యేకలు ఇవీ..

వందే మెట్రో నగరాల మధ్య 100 కిలోమీటర్ల కంటే కంటే తక్కువ దూరం నడుస్తుంది. ఇది వందే భారత్‌లో తక్కువ దూరం ప్రయాణించే రైలు. రైలు ప్రయాణీకులు వేగవంతమైన ప్రయాణ అనుభూతిని పొందుతారు. వందే మెట్రోలో ఎనిమిది కోచ్‌లు ఉండనున్నాయి. సాధారణ వందే భారత్‌ రైలులో 16 కోచ్‌లుంటాయి.

రైలులో ప్రయాణం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం కావడంతో పాటు సమయం సైతం ఆదాకానున్నది. ఈ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారవుతున్నది. లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) డిజైన్‌ను రూపొందించింది.

Exit mobile version