విధాత,మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్‌కు చెందిన సాయిరాం మద్యం సేవించి వాహనాలకు అడ్డంగా వెళ్లడంతో అదే సమయంలో అక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్న ఏఎస్సై పరశురాం మందలించాడు.
దీంతో మద్యం మత్తులో ఉన్న సాయిరాం హంగామా చేస్తూ విద్యుత్ సరఫరా ఉన్న స్తంభంపైకి ఎక్కుతుండగా అక్కడే ఉన్న పోలీసులు కిందకు లాగేశారు. అయినా వెనక్కి తగ్గని సాయిరాం మరోసారి స్థంభం ఎక్కి విద్యుత్ వైర్లను పట్టుకోవడంతో కాలిపోయాడు.
వెంటనే అక్కడ ఉన్న వారు అతన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు. డాక్టర్లు పరీక్షించి తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సాయిరాం వారం రోజుల క్రితం చిన్నశంకరంపేట వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఇదే విధంగా ప్రవర్తించగా, శుక్రవారం అలానే ప్రవర్తించబోయి మరణించాడు.