Site icon vidhaatha

RGV: వీహెచ్ తాతయ్యతో.. మనవడు RGV లొల్లి

విధాత: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ వార్తల్లో ఉండాలని కోరుకుంటారు. రాజకీయాలు, సినిమాలు ఇలా సామజిక అంశాలన్నిటి మీదా బాగా యాక్టివ్ గా ఉంటూ తరచూ ట్విట్టర్, ఫెసుబుక్కులో స్పందించే ఆర్జీవీ ఆమధ్య టీడీపీ, లోకేష్, చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి వారి మీద ట్వీట్స్ చేస్తూ హడావుడి చేశారు.

ఇప్పుడు ఆయన దృష్టి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీ హనుమంత రావు మీదకు మళ్లింది.. తాతయ్యా అంటూ ఆయన్ను వెక్కిరించడం మొదలెట్టాడు. వాస్తవానికి వీహెచ్ ఓ సభలో మాట్లాడుతూ మొన్నామధ్య నాగార్జున యూనివర్సిటీలో ఆర్జీవీ విద్యార్థులతో మాట్లాడుతూ చేసాడని చెబుతున్న కొన్ని వ్యాఖ్యలను ఉటంకించారు.

తాగండి, అమ్మాయిలతో ఎంజాయ్ చేయండి, స్వర్గంలో ఉన్నవన్నీ భూమ్మీద చేయండి అని ఆనాడు ఆర్జీవీ విద్యార్థులకు హితబోధ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు వెల్లువెత్తాయి.. విద్యార్థులకు చెప్పేది ఇదేనా.. వారిని దారి తప్పిస్తున్నారు అంటూ కొందరు ఆర్జీవీ మీద విరుచుకు పడ్డారు.

Exit mobile version