Chhaava Trailer: దేశాన్ని ఊపేస్తున్న ‘ఛావా’ తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది

విధాత‌: విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal) హీరోగా ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) క‌థానాయిక‌గా బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం ఛావా (Chhaava). ఛ‌త్ర‌ప‌తి శివాజీ కుమారుడు శంభాజీ క‌థ ఆధారంగా నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను తీసుకుని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భార‌త‌దేశాన్ని ఇప్ప‌టికీ ఓ ఊపుతూ క‌లెక్ష‌న్ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పుతోంది. ఔరంగా జేబుగా అక్ష‌య్ ఖ‌న్నా (Akshaye Khanna) న‌టించగా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అషుతోష్ రాణా (Ashutosh […]

విధాత‌: విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal) హీరోగా ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) క‌థానాయిక‌గా బాలీవుడ్‌లో రూపొందిన చిత్రం ఛావా (Chhaava). ఛ‌త్ర‌ప‌తి శివాజీ కుమారుడు శంభాజీ క‌థ ఆధారంగా నిజ జీవిత ఘ‌ట‌న‌ల‌ను తీసుకుని తెర‌కెక్కించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి భార‌త‌దేశాన్ని ఇప్ప‌టికీ ఓ ఊపుతూ క‌లెక్ష‌న్ల ప‌రంగా స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్పుతోంది.

ఔరంగా జేబుగా అక్ష‌య్ ఖ‌న్నా (Akshaye Khanna) న‌టించగా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అషుతోష్ రాణా (Ashutosh Rana), దివ్య ద‌త్తా (Divya Dutta), వినీత్ కుమార్ సింగ్ (Vineet Kumar Singh), డ‌యానా పెంటీ (Diana Penty) న‌టించారు. అస్కార్ విన్న‌ర్ రెహామాన్ (A. R. Rahman) సంగీతం అందించారు. గ‌తంలో ముంజియా, స్త్రీ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన మడోక్ ఫిలింస్ ఈ మూవీని నిర్మించ‌గా ల‌క్ష‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం హిందీలోనే రూ.600 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమాను ఇప్పుడు సౌత్‌లో కేవ‌లం తెలుగు భాష‌లో మాత్ర‌మే డ‌బ్ చేసి ఇక్క‌డి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తున్నారు. ప్ర‌ముఖ గీతా ఆర్ట్స్ (Geetha Arts) అల్లు అర‌వింద్ ( Allu Aravind), బ‌న్నీ వాస్ (Bunny Vas) ఈ భాద్య‌త‌ల‌ను తీసుకోగా మార్చి7న రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఈ ఛావా (Chhaava) మూవీ ట్రైల‌ర్ రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్‌ను చూస్తే తెలుగులోనూ వ‌సూళ్ల‌ను తీసుకువ‌చ్చేదిగానే ఉంది. గ‌తంలోనూ గీతా ఆర్ట్స్ ఇలానే కాంతారా సినిమాను తెలుగులో విడుద‌ల చేయ‌గా క‌న్న‌డ‌ను మించి ఇక్క‌డా విజ‌యం సాధించ‌డంతో పాటు అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌ను తీసుకువ‌చ్చింది. దీంతో ఇప్పుడు అంద‌రి చూపు ఈ తెలుగు వ‌ర్ష‌న్‌ ఛావా సినిమాపై ప‌డింది.