DSC 2008 | సారూ.. మీరు మాకు హామీ ఇచ్చారు.. ఉద్యోగాలివ్వండి

దీక్ష చేపట్టిన డీఎస్సీ - 2008 బాధితులు మద్దతు పలికిన ఎంపీ ఆర్ కృష్ణయ్య విధాత: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సారూ.. మీరు మాకు గతంలోనే ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ-2008 (DSC 2008) బాధితులు ఆందోళన చేపట్టారు. తాము 2008 లోనే డీఎస్సీ క్వాలిఫై అయ్యామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమకు ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తే రాష్ట్రం […]

  • Publish Date - May 26, 2023 / 10:28 AM IST

  • దీక్ష చేపట్టిన డీఎస్సీ – 2008 బాధితులు
  • మద్దతు పలికిన ఎంపీ ఆర్ కృష్ణయ్య

విధాత: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సారూ.. మీరు మాకు గతంలోనే ఉద్యోగంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని డీఎస్సీ-2008 (DSC 2008) బాధితులు ఆందోళన చేపట్టారు. తాము 2008 లోనే డీఎస్సీ క్వాలిఫై అయ్యామని, అప్పటి నుంచి ఇప్పటి వరకు తమకు ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తమకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తే రాష్ట్రం ఏర్పడగానే ఉద్యోగం ఇస్తామన్నారు కానీ ఇప్పటి వరకు తమకు ఉద్యోగం ఇవ్వలేదన్నారు. చివరకు న్యాయస్థానం కూడా తమకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పిందని, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని తమకు వెంటనే ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు కోసం శుక్రవారం దీక్ష చేపట్టారు.

“సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ అమలుకై చేపట్టిన దీక్ష”కు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు. దీక్ష శిబిరానికి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇస్తామని 2016లో వరంగల్లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వెంటనే డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. వీరందరికీ ఉద్యోగాలలోకి తీసుకొని, ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు.

Latest News