Visakha Steel
విశాఖ ఉక్కు బిడ్డింగ్‌లో సింగరేణి లేనట్టేనా !
విధాత: ఏదైనా అవకాశం రావాలే గానీ హైప్ క్రియేట్ చేసుకోవడంలో కేసీఆర్ ను మించినవాళ్లు లేరు. పంజాబ్ రైతుల ఉద్యమం దగ్గర్నుంచి చూస్తే నేటి విశాఖ స్టీల్ (Visakha Steel) ప్లాంట్ సమస్య వరకూ అన్నిటా మేముంటాం.. అందర్నీ ఆదుకుంటాం అంటూ దేశవ్యాప్తంగా డప్పు కొట్టే కేసీఆర్ చివరకు మాత్రం అంతా వట్టిదే అనిపిస్తారు.
విశాఖ ఉక్కు (Visakha Steel) ఫ్యాక్టరీలో కొంత వాటాను దాదాపు ఐదువేల కోట్లకు వేరే ప్రైవేట్ భాగస్వాములకు కట్ట బెట్టేందుకు కేంద్రం సిద్ధమై ఉంది. సరిగ్గా ఈ పాయింట్‌ను వాడుకుని ఆంధ్రలో భారత రాష్ట్ర సమితిని ముందుకు తీసుకుపోయే ఉద్దేశ్యంతో కేసీఆర్ స్పీడ్ గా పావులు కదిపారు.
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఆ వాటాను తీసుకుంటామని ఉక్కు ఫ్యాక్టరీకి ప్రాణం పోస్తాం అని భారీ ప్రకటనలు ఇవ్వడం కాకుండా సింగరేణి అధికారులు కొందరిని హుటాహుటిన ఉక్కు ఫ్యాక్టరీ సందర్శనకు సైతం పంపారు.
ఆ రోజే కేంద్ర సహాయమంత్రి తెలిసీ తెలీక Visakha Steel పై ఓ ప్రకటన చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ కాదని.. అన్నారు.. ఇక కేటీఆర్.. హరీశ్‌రావు వంటి వారు మీడియాలో మాట్లాడుతూ కేసీఆర్ అడుగు పెట్టగానే కేంద్రం భయపడిందని..అందుకే Visakha Steel ప్రైవేటీకరణ ఆగిందని ఊదర గొట్టేశారు. మళ్లీ మరునాడు కేంద్రం లైన్లోకి వచ్చి.. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి అన్నీ సిద్ధం చేస్తున్నాం బిడ్స్ పిలుస్తాం అంటూ ఏప్రిల్ ఇరవై లోపు ఆసక్తి ఉన్న ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరింది.
అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అర్హత లేదని.. వాళ్ళు బిడ్స్ వేయ లేరని గతంలోనే నిబంధనలు విడుదల చేసింది. అవి దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయినాయి కూడా. మరి ఈ రూల్స్ తెలీకుండానే కేసీఆర్ ఈ బిడ్డింగ్ కోసం అధికారులును మొన్న పంపారా.. అదంతా ఆ పూటకు హైప్ క్రియేట్ చేసే డ్రామా.. వాస్తవానికి నిన్నటితో ముగిసిన బిడ్డింగులో సింగరేణి పాల్గొనలేదని బీజేపీ నాయకులు చేసిన ప్రకటనతో కేసీఆర్ జస్ట్ ఓ టైంపాస్ నాటకం ఆడారని అర్థం అయింది.