Site icon vidhaatha

Warangal: మెడికో ప్రీతిది ఆత్మహత్యే.. సైఫ్ ప్రధాన కారణం: CP రంగనాథ్

Warangal

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ మెడికో ప్రీతిది ఆత్మహత్యేనంటూ మరోసారి వరంగల్(Warangal) పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు. హనుమకొండలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై ఆయన స్పందించారు.

ప్రీతికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందని ఆయన చెబుతూ ప్రీతిది హత్య కాదని, ఆత్మహత్యగా భావిస్తున్నట్లు చెప్పారు. గతంలోనే ఆయన చెప్పినట్లు ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. సిరంజి లభించినప్పటికీ, నీడిల్ దొరకలేదని చెప్పారు.

ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని సిపి చెప్పారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించామని త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీపీ రంగనాథ్ చెప్పారు. ఇదిలా ఉండగా ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్య అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

పూర్వపరాలు ఇలా ఉన్నాయి

కేఎంసీలో పీజీ చదువుతున్న మెడికో ప్రీతి ఫిబ్రవరి 22వ తారీకు అపస్మార్గ స్థితిలో ఎంజీఎంలో గుర్తించారు. వెంటనే ఆమెకు తగిన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. మెడికో ప్రీతికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆమెకు కిడ్నీ, థైరాయిడ్ సమస్య ఉందంటూ ఫిబ్రవరి 22న ఎంజీఎం అధికారులు ప్రకటించారు. దీనిపై విచారణ చేసిన సీపీ ప్రీతిది పక్కా సూసైడ్ అంటూ కావాల్సిన ఆధారాలున్నాయి. అనారోగ్య సమస్యలు అనడం సరికాదంటూ ఫిబ్రవరి 24న సీపీ రంగనాథ్ ప్రకటించారు.

ఈ మేరకు సీనియర్ మెడికో సైఫ్ ను నిందితునిగా పేర్కొంటూ అరెస్టు చేసి జైలుకు పంపించారు. సైఫ్ గురువారం బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మెరుగైన చికిత్స కోసం ప్రీతిని నిమ్స్ హాస్పిటల్ కు పంపించగా ఫిబ్రవరి 26న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

మార్చి 05న వచ్చిన టాక్సికాలజీ రిపోర్ట్ లో ప్రీతి ఒంట్లో ఎటువంటి విష పదార్థాలు లేవని తేలింది. ఈ నేపథ్యంలో ప్రీతిది ఆత్మహత్య అంటూ దానికి సైఫ్ కారణమని తాజాగా సీపీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. 306 ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలో కేసుకు సంబంధించిన చార్జీ షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

Exit mobile version