Site icon vidhaatha

నా బిడ్డతో కలిసి ‘GST’ సినిమా చూశా: వర్మ తల్లి

విధాత‌: ఎవరి బిడ్డ వారికానందం. కాకి బిడ్డ కాకికి ముద్దు. అలాగే ఎవరి బిడ్డ వారికి ముద్దు. తమ కుమారుడు లేదా కుమార్తె ఎలాంటివారైనా వారి తల్లిదండ్రులకు వారు చిన్న పిల్లలతో సమానం. చ… మావాడు అలాంటివాడు కాదు. వాడు రాముని మించిన రాముడు అంటారు. అందుకే మన పెద్దలు తండ్రి లాంటి రక్షణ తల్లి లాంటి శిక్షణ అన్నారు.

ఏ బిడ్డ భవిష్యత్తు అయినా తల్లి చేతుల్లో ఉంది. ఒక బిడ్డ ఆర్థిక కష్టనష్టాల బారిన పడకుండా చూసే బాధ్యత తండ్రి మీద ఉంటుంది. తల్లి ప్రేమను చాటే కథలు మ‌న‌కు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి తీసుకుంటే ఒక దుర్మార్గుడైన వేశ్య లోలుడు ఉండేవాడు.

అతడు కోరుకున్న వేశ్య అతి క్రూర‌మైన‌ శాడిస్ట్ అన్నమాట. నా వక్షోజాలను తాకాలంటే నీ తల్లి గుండెని కోసి తీసుకుని రా అని ఆజ్ఞాపిస్తుంది. ఆ దుర్మార్గుడు నీ గుండె కావాలి అని తల్లిని అడుగుతాడు. దానికి ఆమె అలాగే నాయనా నీ సంతోషం కోసం…. సుఖం కోసం ఏమైనా ఇస్తానంటుంది.

అప్పుడు ఆ దుర్మార్గుడు ఆమె గుండెను కోసుకొని వేశ్య‌ దగ్గరికి వెళ్లి తన కోరిక తీర్చుకుంటాడు. తర్వాత వెళ్ళిపోబోతూ చీకట్లో రాయిని తట్టుకొని పడిపోతాడు. అప్పుడు ఆ తల్లి గుండె ఏం నాయన నొప్పిగా ఉందా నీ నొప్పి ఎలా పోగొట్టాలి నాయనా…. అంటూ కన్నీరు మున్నీరు కారుస్తుంది. ఇది తల్లి ప్రేమ అంటే.

విషయానికి కొస్తే మన తెలుగు దర్శకులలో బాలీవుడ్‌కి వెళ్లి మన జెండా ఎగురవేసిన వ్యక్తి రాంగోపాల్ వర్మ. ఆయ‌న‌కు తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను శివ ముందు శివ త‌ర్వాత అని చెప్పుకుంటున్నామంటే అది మామూలు విష‌యం కాదు. కానీ ఆ తర్వాత ఆయ‌న దానిని దిగజార్చుకుంటూ చివరకు అధోగతి పాల‌య్యాడు. అథోఃపాతాళానికి చేరాడు.

ఆ మధ్య ఒకసారి తన కూతురు పెళ్లిలో తాను అసలు తన భార్య పక్కనే లేనని అతిధులతో పాటు ఒక మూలన నుంచున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు తన కూతురు జిమ్ చేస్తున్న ఎక్స్పోజింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇదో శాడిజం. మరి అలాంటి శాడిజం కలిగిన తన కొడుకు గురించి ఆయ‌న త‌ల్లి ఏమనుకుంటుంది? అని పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో మాట్లాడుతూ..

వర్మ చిన్నప్పుడు గుడ్ బాయ్‌గానే పెరిగాడు. ఇప్పుడు ఎలా బ్యాడ్ బాయ్ అవుతాడు? చిన్నతనం నుంచి నేను రామును అర్థం చేసుకోలేదు. చదువు మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పేదాన్ని. తనకు అసలు చదువు అంటేనే ఇష్టం ఉండేది కాదు. ఇక సినిమాల విషయంలో సైతం రాము పంథానే వేరు.

ఇక అతనిని చూస్తే నాకు ఒక యోగిలా, సైంటిస్టులా కనిపిస్తాడు. మా రాము తీసిన జిఎస్టీ సినిమాను.. నేను, రాము కలిసి చూశాం.. ఏదో ఒక బయాలజీ క్లాస్ వింటున్నట్టు అనిపించింది. ఒక డాక్టర్‌ నేను మీ ఆపరేషన్ థియేటర్లోకి వచ్చి ఆపరేషన్ చూడనివ్వండి అన్నట్లుగా అడిగినట్లు అనిపించింది.

ఈ సినిమా మళ్లీ వేరే వారితో అయితే నేను చూడలేను.. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ నెట్టింట వైరల్‌గా మారింది. కొడుకు ఎలాంటి వాడు అయినా తల్లికి మాత్రం మంచి వాడే.. అందుకు తాను కూడా అతీతం కాను అంటుంది రాంగోపాల్ వర్మ తల్లి సూర్యవతి.. అది తల్లి ప్రేమంటే!

Exit mobile version