విధాత: మునుగోడులో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకున్నది. నేతలపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. మునుగోడులో మరోసారి పోస్టర్ల కలకలం చెలరేగింది. చండూరులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.
కాగా.. రూ. 18 వేల కోట్లతో ఇటీవల పోస్టర్లు అతికించగా, మరోసారి దుబ్బాక, హుజురాబాద్ ప్రజల పేరుతో మేము మోసపోయాం.. మీరు మోసపోవద్దంటూ.. పోస్టులు వెలిశాయి. దుబ్బాక ప్రజల్లాగా మునుగోడు ప్రజలు మోసపోవద్దంటూ గుర్తుతెలియని వ్యక్తులు కూడళ్ల వద్ద పోస్టర్లు అంటించారు.