Site icon vidhaatha

Balka Suman | కాంగ్రెస్ పార్టీలోకి కొందరు కోవర్టులను పంపాం: బాల్క సుమన్

Balka Suman |

విధాత: కాంగ్రెస్ పార్టీలో కొందరూ తమ వాళ్లేనని, వాళ్లను పంపింది తామేనని చెన్నూర్ బీఆరెస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కనిపిస్తే ఏమీ అనకండన్నారు. వాళ్లు మనోళ్లేనని, మనమే కొందరిని పంపించాం కూడానని, ఎన్నికలయ్యాక మళ్లీ మన పార్టీలోకి వస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ట్వీట్టర్‌లో సందడి చేస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నుంచి గెలిచినా ఎమ్మెల్యేలను ఆ పార్టీలో ఉండి కుక్కల మాదిరిగా అరవకుండా బీఆరెస్‌లోకి తీసుకొచ్చామంటూ చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం మరువకముందే కాంగ్రెస్‌లో కొందరూ మన కోవర్టులున్నారంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Exit mobile version