Site icon vidhaatha

‘ఆమెకు నువ్వేకావాలి’.. సమంత ఉద్దేశం ఏంటి?

విధాత‌: హీరోయిన్‌గా విభిన్న పాత్రలతో దక్షిణాదిలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సమంత. వెబ్ సిరీస్ ద్వారా కూడా ఈమె భార‌తీయ సినీ ప్రేక్షకులను అలరించింది. ఏకంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించగలిగిన సత్తా ఈమెకు ఉంది. అందుకే ఆమె ప్రధాన పాత్రలో ప‌లు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘యశోద’ చిత్రమైతే ఘన విజయం సాధించి యూనిట్ మొత్తానికి మంచి పేరు తీసుకువచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టుగా నిలిచింది. వసూళ్లపరంగా సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసెర్‌గా నిలిచింది. ఇలాంటి సమయంలోనే ఆమె వ్యక్తిగత జీవితం ఇబ్బందుల్లో పడింది. ఒకవైపు నాగచైతన్యతో విడాకులు… మరోవైపు ప్రాణాంతకమైన మయోసైటిస్ వ్యాధి సోకడం ఆమెను బాగా ఇబ్బందుల‌కు, ఆవేద‌న‌కు గురి చేస్తున్నాయి. కానీ గుండె నిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తోంది.

విజయ్ దేవరకొండతో ఆమె నటిస్తున్న ఖుషి చిత్రం అనారోగ్యం కారణం వల్ల ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఆల్రెడీ ఈ చిత్ర రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక‌ప్పుడు సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండేది.

కానీ ఈమధ్య అనారోగ్యం, చికిత్స కారణాల వలన సోషల్ మీడియా వాడడం తగ్గించింది. తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది. అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అర్థమయి కానట్లుగా కాస్త కన్ఫ్యూజ‌న్‌కు గురి చేస్తోంది.

Exit mobile version