WhatsApp | వాట్సాప్‌లో సూపర్‌ ఫీచర్‌.. ఇంటర్నెట్‌ లేకుండానే చాటింగ్‌..!

WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మెసేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్‌ కాల్స్ సేవలు అందిస్తున్నది. అయితే, ఇందులో ఏ సర్వీసులను వాడినా ఇంటర్న్‌ట్‌ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, తాజాగా వాట్సాప్‌ యూజర్ల కోస కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఆ ఫీచర్‌ సహాయంతో ఇంటర్నెట్‌ లేకుండానే వాట్సాప్‌లో చాట్‌ చేసుకునే అవకాశం ఉన్నది. వాట్సాప్‌ తీసుకువస్తున్న ఈ ఫీచర్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది. […]

  • Publish Date - May 13, 2023 / 05:51 AM IST

WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. మెసేజ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, గ్రూప్‌ కాల్స్ సేవలు అందిస్తున్నది. అయితే, ఇందులో ఏ సర్వీసులను వాడినా ఇంటర్న్‌ట్‌ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, తాజాగా వాట్సాప్‌ యూజర్ల కోస కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.

ఆ ఫీచర్‌ సహాయంతో ఇంటర్నెట్‌ లేకుండానే వాట్సాప్‌లో చాట్‌ చేసుకునే అవకాశం ఉన్నది. వాట్సాప్‌ తీసుకువస్తున్న ఈ ఫీచర్‌ సర్వత్రా చర్చనీయాంశమైంది. వాట్సాప్‌ను ఇంటర్నెట్‌ లేకుండా ఎలా చాట్‌ చేయొచ్చనే విషయంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఆ ఫీచర్ ఎలా వాడాలి? నిజంగానే పనిచేస్తుందా? తెలుసుకుందాం రండి..!

వాట్సాప్ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్ వాట్సాప్‌ ప్రాక్సీ. మొబైల్ డేటా అందుబాటులో లేని సమయంలో ఈ వాట్సాప్ ప్రాక్సీ ద్వారా చాట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సెట్టింగ్స్ లో స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేస్తే చివరలో ప్రాక్సీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది.

ఒక వేళ ఆ సెట్టింగ్స్‌ కనిపించకపోతే వాట్సాప్‌ లేటెస్ట్‌ వర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ప్రాక్సీ సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి ప్రాక్సీ అడ్రస్‌ సెట్‌ చేయాలి. కనెక్షన్‌ ఎస్టాబ్లిష్‌ అవ్వగానే ఒక చెక్‌ మార్క్‌ కనిపిస్తుంది. అప్పుడు ఇంటర్నెట్‌ లేకుండానే ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్‌తో ఛాటింగ్ చేసుకునే వీలుంటుంది.

అత్యవసరం అయితేనే ప్రాక్సీని వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ప్రాక్సీ చేయడంతో మీ ఐపీ అడ్రస్‌ ప్రాక్సీ ప్రొవైడర్‌ తెలిసిపోతుంది. అలాగే ప్రాక్సీ సమయంలో ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆన్‌లో ఉందో లేదో తప్పని సరిగా చూసుకోవాలి.

ప్రాక్సీ ద్వారా వాట్సాప్‌ను ఉపయోగించడం ద్వారా ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లదని, ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ద్వారా సురక్షితంగా ఉంటుందని మెటా పేర్కొటుంది. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

Latest News