Site icon vidhaatha

Whatsapp | వాట్సాప్‌ మరో అద్భుతమైన ఫీచర్‌.. స్టేటస్‌ను ఫేస్‌బుక్‌లోకి నేరుగా..!

WhatsApp |

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ వాడేస్తున్నారు. ఆయా సోషల్‌ మీడియా యాప్స్‌లో యువత తెగ వాడేస్తున్నారు. యాప్స్‌కు ఉన్న క్రేజ్‌తో మెటా కంపెనీ పేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ కంపెనీలో విలీనం చేసుకున్నది. యూజర్ల ఆకట్టుకునేదుకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను తీసుకువస్తున్నది.

తాజాగా వాట్సాప్‌(Whatsapp) స్టేటస్‌ షేరింగ్‌పై అదిరిపోయే ఫీచర్లను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. మెస్సేజ్‌, ఫొటోలు, వీడియోల షేరింగ్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్నది. స్టేటస్‌లో ఉండే షేరింగ్ ఆప్షన్‌ను మరింత సులభతరం చేస్తోంది. మెటా యాజమాన్య పరిధిలో ఉన్న ఇతర ప్లాట్‌ఫామ్‌లతో స్టేటస్‌‌లను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడనున్నది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే పోస్టులు, రీల్స్‌లను నేరుగా ఫేస్‌బుక్‌లోకి షేర్ చేసుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇదే తరహాలో తాజాగా వాట్సాప్ స్టోరీని లింక్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా షేర్ చేసుకునేందుకు యూజర్లకు పర్మిషన్ ఇవ్వనున్నది.

ఇప్పటిదాకా యూజర్లు ఆటో షేర్ ఆన్ ఫేస్‌బుక్ ఎంపికను ఆన్ చేస్తే వాట్సాప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేసుకోవచ్చు. ఎవరైతే యాప్ సెట్టింగ్స్‌ను మారుస్తారో వారు ఎప్పుడైనా ఈ ఆప్షన్‌ను స్టార్ట్ చేయొచ్చు.. లేదంటే ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది.

షేర్ స్టేటస్ అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ట్రయల్స్‌ దశలో ఉండగా.. త్వరలోనే అందుబాటులోకి రానున్నది.

Exit mobile version