నిజామాబాద్‌: భర్తను హతమార్చిన భార్య.. ముగ్గురి అరెస్ట్

విధాత, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా అంక్సాపూర్ గ్రామంలో భర్తను హతమార్చిన ఘటనలో భార్యతో సహా మరో ఇద్దరిని వేల్పూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తిని అతని భార్య జమున, నగేష్, గంగారాం సహకారంతో గత అక్టోబర్ 20న పొలం వద్ద కొట్టి చంపారు. అనంతరం రంజిత్ కుమార్ శవాన్ని పూడ్చి పెట్టారు. నాలుగు రోజుల తర్వాత జమున అనుమానం రాకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ కు […]

  • Publish Date - December 6, 2022 / 03:09 PM IST

విధాత, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా అంక్సాపూర్ గ్రామంలో భర్తను హతమార్చిన ఘటనలో భార్యతో సహా మరో ఇద్దరిని వేల్పూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తిని అతని భార్య జమున, నగేష్, గంగారాం సహకారంతో గత అక్టోబర్ 20న పొలం వద్ద కొట్టి చంపారు.

అనంతరం రంజిత్ కుమార్ శవాన్ని పూడ్చి పెట్టారు. నాలుగు రోజుల తర్వాత జమున అనుమానం రాకుండా ఉండేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు భర్తతో గొడవ జరిగిందని, దీంతో తన భర్త ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగు చూశాయి.

పథకం ప్రకారం భార్య జమున తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న నగేష్ అనే వ్యక్తితో పాటు బైండ్ల గంగారాంతో కలిసి హతమార్చినట్లు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు, సీఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వారి నుండి ఒక బైక్, మూడు సెల్ ఫోన్లు, ఇతర మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.