- అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆస్తుల సంపాదనపై దృష్టి
- అభివృద్ధిని పట్టించుకోని ప్రజా ప్రతినిధులు
- తూర్పులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
- వచ్చే ఎన్నికల్లో సురేఖను గెలిపించండి
- వరంగల్ కార్నర్ మీటింగులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధిని విస్మరించి ఆస్తుల సంపాదన మీద కేంద్రీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వరంగల్ తూర్పు ,పశ్చిమ ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం చేపట్టిన హాత్సేహాత్ జోడో పాదయాత్ర సందర్భంగా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లో సాయంత్రం జరిగిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధి చెందలేదని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కంటే అక్రమ సంపాదన పై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారని ఆరోపించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతాయన్నారు. ఈ మీటింగుకు ముందు ఎంజీఎం సెంటర్, పోచమ్మ మైదాన్ నుంచి మండి బజార్ చౌరస్తా మీదుగా హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు పాదయాత్ర సాగింది.
కాంగ్రెసులో కదలిక
చాలా కాలానికి వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక భారీ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. గత మూడు నాలుగు ఏళ్లుగా ఈ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకున్న వారే లేరు. తాజా కార్యక్రమంతో కాసింత కదలిక ప్రారంభమైంది. యాత్ర అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఇబ్బందులు
టిఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ, ఉద్యమం పేరుతో రెండు పర్యాయాలు అధికారం కైవసం చేసుకుని రాష్ట్రాన్ని కేసీఆర్,
ఇప్పటికైనా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం, బెల్ట్ షాపులు ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్ తూర్పులో కొండ సురేఖను గెలిపించండి, రాష్ట్రంలో ఆమెకు సముచిత స్థానం లభిస్తుందన్నారు.
మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి, కొండా మురళి రెండు పులులేనని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కొండా మురళి, దొమ్మాటి సాంబయ్య సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.