Video viral
విధాత: చనిపోయిందని వైద్యులు నిర్ధారించిన మహిళ శవపేటిక నుంచి సజీవంగా బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఈక్వెడార్‌లోని బాబాహోయో నగరంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నర్సుగా పనిచేసిన 76 ఏళ్ల బెల్లా మోంటాయా అనే మహిళ గుండెపోటుతో మరణించిందని వైద్యులు గత వారం ధ్రువీకరించారు. ఆమె కార్డియోరెస్పిరేటరీ అరెస్ట్ (Cardiorespiratory Arrest)తో చనిపోయారని డ్యూటీలో ఉన్న వైద్యుడు ఇచ్చిన నివేదికలోనూ పేర్కొన్నారు. కృత్రిమ శ్వాస కూడా తీసుకోలేక పోవడంతో చనిపోయినట్లు నిర్ధరించారని దేశ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.