Site icon vidhaatha

సీట్ కోసం మహిళల ఫైట్.. మధ్యలో వెళ్లి గాయపడ్డ పోలీస్ (వీడియో)

విధాత‌, ముంబై: ముంబై లోకల్ ట్రైన్‌లో సీట్ కోసం మహిళలు జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా పోలీసులపై దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. థానే – పన్వేల్ మధ్య నడిచే లోకల్ ట్రైన్లో తుర్బే స్టేషన్ ఓ సీటు ఖాళీ అయింది.

అయితే అందులో కూర్చునేందుకు ఇద్దరు మహిళలు ప్రయత్నించడంతో వారి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా పరస్పరం దాడి చేసుకునే స్థాయికి వెళ్లింది. వారిద్దరికి మరికొందరు మహిళలు తోడవడంతో మహిళా కంపార్ట్ మెంట్ రణరంగంలా మారింది. కోపంతో ఊగిపోయిన జుట్టు పట్టుకుని రక్తం వచ్చేలా కొట్టుకున్నారు.

విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. కొందరు మహిళలు ఆమెపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో మహిళా కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళల గొడవకు సంబంధించి కేసు నమోదుచేసిన గవర్నమెంట్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version