Site icon vidhaatha

Yadadri Bhuvanagiri: చెట్టును ఢీకొన్న బస్సు.. ప్రయాణికులకు గాయాలు

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం టేకులసోమరం పడమటి వారి గూడెం వద్ద ప్రమాదం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. యాదగిరిగుట్ట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్గొండ నుంచి భువనగిరికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొంత మందికి తీవ్ర గాయాలు, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. చెట్టుకు బస్సు ఢీకొనడంతో డ్రైవర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కోని తీవ్ర గాయాలతో అరగంటకు పైగా అవస్థలు పడ్డాడు. స్థానికులు, పోలీసులు సీట్లు తొలగించి డ్రైవర్ ను కాపాడి కిందకు దించారు.

క్షతగాత్రులను భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్ లింగం బోనగిరి మండలం పచ్చర్ల బోడు తండా వాసి. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక ఎస్సై ప్రభాకర్, తహసిల్దార్ గణేష్ లు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు.

Exit mobile version