Site icon vidhaatha

విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

విధాత‌: దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు.. విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్ చేరుకున్నారు.

వరంగల్‌లో (ములుగు రోడ్డులో) నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కు ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.

ఈ దేశం చాలా గొప్ప దేశం. స‌హ‌న‌శీల‌త దేశం. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే దేశం. పోరాటాల‌తో ముందుకు పోయే దేశం. అంద‌ర్నీ క‌లుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం.ప్రేమ‌తో బ‌తికేట‌టువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌, నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదు.. స‌మాజానికి మంచిది కాదు. నా వ‌య‌సు అయిపోతా ఉంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భ‌విష్య‌త్ మీది.. ఈ భార‌త‌దేశం మీది. విద్యార్థులుగా, యువ‌కులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే క‌ర్తవ్యం మీ మీద ఉంట‌ది. మెడిక‌ల్ విద్య‌తో పాటు సామాజిక విద్య‌ను కూడా పెంపొందించుకోవాలి. ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలి.

కేసీఆర్ ఉద్య‌మం ప్రారంభించిన‌ప్పుడు.. ఇక్క‌డున్న విద్యార్థులు చాలా మంది పుట్ట‌లేద‌ని చెప్పారు. వారు పుట్టి పెరిగారు.. వారికి అన్ని విష‌యాలు తెలుసు. ఈ న‌వీన స‌మాచార విప్ల‌వం ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తుంది. అద్భుత‌మైన జ్ఞానాన్ని స‌ముపార్జిస్తున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల అండ‌తో ఉద్య‌మం సాగించి, రాష్ట్రాన్ని సాధించామ‌న్నారు. అనేక రంగాల్లో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. రాజ‌కీయాల కోసం కేంద్ర మంత్రులు కేసీఆర్‌ను, మంత్రుల‌ను ఇవాళ తిట్టిపోతారు. రేపు అవార్డులు ఇస్తారని అన్నారు.

ఉద్య‌మ స‌మ‌యంలో చెప్పిన‌వ‌న్నీ ఇవాళ సాకారం అయ్యాయి. తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువ‌గా ఉంది. ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు అనేక రంగాల్లో ముందంజ‌లో ఉన్నాం. తెలంగాణ ప్ర‌జ‌ల్లో అద్భుత‌మైన చైత‌న్యం ఉంది. ఆకాంక్ష‌ల మేర‌కు ప‌నిచేస్తున్నాం. ఆరోగ్యం రంగంలో కూడా అద్భుతాలు సాధించాం. మ‌రిన్ని విజ‌యాలు సాధించాలి.

ఉమ్మడి రాష్ట్రంలో ఐదు కాలేజీలు మాత్ర‌మే ఉండే. కొత్త‌గా 12 కాలేజీలు మంజూరు చేశాం. కేంద్రం వివ‌క్ష చూపించింది. 33 జిల్లాల్లో మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేశాం. త్వ‌ర‌లోనే అన్ని కాలేజీలు ప్రారంభ‌మ‌వుతాయి. హ‌రీశ్‌రావు సార‌థ్యంలో ఇది సాధ్య‌మైంది. 2014కు ముందు 2800 మెడిక‌ల్ సీట్లు ఉండేవి. 6500 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయి. దాదాపు 10 వేలు కూడా దాటే అవ‌కాశం ఉంది.

ర‌ష్యా, ఉక్రెయిన్‌కు వెళ్లే అవ‌కాశం కూడా రాదు. 1150 సీట్లు ఉంటే 2500 ఉన్నాయి. చాలా బాగా పురోగ‌మిస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణ దేశానికే ఒక ఉదాహ‌ర‌ణ‌గా ఉంది. ఏ దేశ‌మైనా, స‌మాజ‌మైనా చుట్టు సంబంశించే ప‌రిణామాలు చూస్తూ అప్డేట్‌గా ఉండే ముందుకు పురోగ‌మిస్తుంది. ఏమారుపాటుతో ఉంటే చాలా దెబ్బ తింటాం. మ‌న రాష్ట్రంలో మ‌నం ప‌డ్డ బాధ‌నే గుర్తు చేసుకుందాం. నాటి నాయ‌క‌త్వం త‌ప్పిదం వ‌ల్ల రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ద‌శాబ్దాల కాలం ప‌ట్టింది. ఏడేండ్ల కింద తెలంగాణ‌కు, ఇప్పుడున్న తెలంగాణ‌కు చాలా తేడా ఉంది. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను బాగు చేసుకున్నాం.

దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచే స్థాయికి ఎదిగాం. భార‌త‌దేశం ప్ర‌పంచానికే అన్న‌పూర్‌ణ లాంటిది. వ్య‌వ‌సాయ అనుకూల భూమి అమెరికాలో లేదు. చైనాలో కూడా 16 శాతం వ్య‌వ‌సాయం భూమి ఉంది. అద్భుత‌మైన ప‌ద్ధ‌తుల్లో 50 శాతం భూమి వ్య‌వ‌సాయానికి అనుకూలంగా దేశంలో భూమి ఉంద‌న్నారు. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అన్ని ర‌కాల నేల‌లు కూడా ఉన్నాయి. 70 వేల టీఎంసీల‌లో ప్ర‌వ‌హించే నీళ్లు ఉన్నాయి.

ఇన్ని వ‌న‌రులు, వ‌స‌తులు ఉన్న ఈ దేశంలో వంచించ‌బ‌డుతుంది. అవ‌కాశాలు కోల్పోతుంది. 13 నెల‌ల పాటు రైతులు ధ‌ర్నా చేశారు. వ‌స‌తులు, వ‌న‌రులు లేక వారు ధ‌ర్నా చేయ‌లేదు. ఈ దేశం నాది అని భావించే వారు ఎప్ప‌టిక‌ప్పుడు అప్డేట్ కావాలి. ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగ‌ఫ‌లం మ‌న పెద్ద‌ల విజ్ఞానం ల‌భించింది కాబ‌ట్టి ఈ విధంగా ఉన్నాం. రాబోయే త‌రాల‌కు మంచిని, సంస్కారాన్ని, అభ్యుద‌య భావ‌జాలాన్ని అందించాలి.

హెల్త్ ప్రొఫైల్ తెలంగాణ త‌యార‌వుతుంది. రాబోయే కొద్ది రోజుల్లో ప్ర‌యోగ‌త్మ‌కంగా.. సిరిసిల్ల‌, ములుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో 100 శాతం హెల్త్ ప్రొఫైల్‌ను త‌యారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఒక వ్య‌క్తికి ఏ ర‌క‌మైన జ‌బ్బు వ‌చ్చినా.. ఒక్క నిమిషంలో డేటా బ‌య‌ట‌ప‌డుతుంది. 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కార్య‌క్ర‌మం పూర్త‌యితే నిమిషంలోనే వారి చ‌రిత్ర తెలుస్తుంది.

క్ష‌ణాల్లో వైద్యం అందుతుంద‌న్నారు. అద్భుత‌మైన విజ‌యాలు సాధించిన వాళ్లం అవుతాం. వ‌రంగ‌ల్ ఎంజీఎంకు వ‌చ్చే హైద‌రాబాద్‌ను మించిపోయే విధంగా సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మించ‌బోతున్నాం. హెల్త్ యూనివ‌ర్సిటీని కూడా వ‌రంగ‌ల్‌లోనే నెల‌కొల్పామ‌ని చెప్పారు.

Exit mobile version