Site icon vidhaatha

వైయస్ షర్మిల మరోసారి అరెస్ట్.. అచ్చిరాని ఉమ్మడి వరంగల్

YSRTP అధ్యక్షురాలు షర్మిల తన ఘాటైన వ్యాఖ్యలు, వివాదాస్పద మాటలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లక్ష్యంగా ఆమె చేస్తున్న విమర్శలు మాటల మంటలు పుట్టిస్తున్నాయి. అవినీతి, అక్రమాల పై విమర్శల బాణాలు ఎక్కువ పెడుతూ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత దూషణలు కూడా దిగడం వేడి పుట్టించింది. ఆమె కూడా వివాదంలో ఇరుక్కుంటున్నారు. తాజాగా మరో సారి ఆమె యాత్ర మానుకోటలో ఆగిపోయింది. షర్మిల యాత్రకు వరంగల్ ఉమ్మడి జిల్లా అచ్చి రావడం లేదని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వైయస్సార్టీపీ (Ysrtp)అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆదివారం ఉదయం మానుకోట పోలీసులు (police)అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఏదేమైనా మరోసారి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో షర్మిల ఈరోజు ఆదివారం చేపట్టాల్సిన పాదయాత్ర అర్ధాంతరంగా రద్దయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో (warangal dist)షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించడం ఇది రెండవసారి, పాదయాత్ర రద్దు కావడం ఇది రెండవసారి.

అప్పుడు నర్సంపేట (narsanpet)ఇప్పుడు మానుకోట

గతంలో వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలో అరెస్టు చేయగా, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు ప్రాంతంలో అరెస్టు చేశారు. శనివారం రాత్రి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పై కార్నర్ మీటింగ్లో షర్మిల చేసిన వ్యాఖ్యలు ఈ అరెస్టుకు కారణంగా చెబుతున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ‘ఎవడ్రా శంకర్ నాయక్ కొజ్జా’ అంటూ ప్రశ్నించడం పలు సవాళ్లు చేయడం కారణంగా చెబుతున్నారు.

ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గులాబీ శ్రేణులు తమ పాదయాత్రను అడ్డుకుంటే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, ముందుగానే భావించి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసు అనుమతి సందర్భంగా ఇచ్చిన నియమ, నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పాదయాత్ర అనుమతి (permission) రద్దు చేశారు. ఎమ్మెల్యే పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇదే మంచి అవకాశంగా భావించి అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు.

క్యారవాన్‌లోనే అరెస్టు

షర్మిల (sharmila)ను తాను బస చేసిన క్యారవాన్‌లో నుంచి అదుపులోకి తీసుకొని పోలీసు వాహనాలలో హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా షర్మిలకు పోలీసులకు మధ్య కొద్దిసేపు బస్సు లోపల వాగ్వివాదం జరిగింది. తాను బస్సు దిగనని అంటూ పట్టుబట్టినప్పటికీ మహిళా పోలీసులు సహకారంతో కిందకు దించారు. ముందుగా ఏర్పాటు చేసిన పోలీసు వాహనాల్లోకి (vehiclels)ఎక్కించి, తగిన బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలించారు. ఎవరికీ కనిపించకుండా పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.

నేడు డోర్నకల్ పాదయాత్ర రద్దు

ఆదివారం షర్మిల పాదయాత్ర మహబూబాబాద్ నుంచి ప్రారంభమై డోర్నకల్ నియోజకవర్గంలో కొనసాగనున్నది.ఈ రాత్రి డోర్నకల్ నియోజకవర్గం పురుషోత్తయగూడెంలో బస్సు చేయాల్సి ఉండగా పోలీసులు అరెస్టు చేయడంతో యాత్ర అర్ధాంతరంగా వాయిదా పడింది. తిరిగి ఆమె యాత్ర ప్రారంభం అవుతుందా? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రెండు పర్యాయాలు ఆమె యాత్ర వివాదాస్పదమైంది.

పోలీసులు పలు నిబంధనలు విధించారు. ఆమె కోర్టును ఆశ్రయించడం, తదితర కారణాలతో రెండోసారి పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ ఈసారి స్థానికంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయని కారణంతో యాత్రకు అనుమతి ఇవ్వకపోవచ్చు అని అంటున్నారు. ఏదేమైనా మరోసారి షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో షర్మిల మరోసారి కోర్టును (court) ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు.

WARANGAL: ఏవడ్రా కొజ్జా శంకర్ నాయక్..? ముందు నీ భార్యకు విడాకులివ్వు: షర్మిల

Exit mobile version