Site icon vidhaatha

నెలాఖరులోగా తేల్చండి.. కాంగ్రెస్ హైకమాండ్‌కు షర్మిల డెడ్‌లైన్‌

విధాత : కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనంపై పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధిష్టానానికి డెడ్‌లైన్ విధించారు. ఈనెల 30వ తేదీలోగా పార్టీ విలీనంపై కాంగ్రెస్ వైఖరీ తేల్చాలని ఆమె ఆ పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం తరహాలో డిమాండ్ చేస్తూ కీలక ప్రకటన వెలువరించారు. తమ పార్టీ విలీన షరతులపై ఈనెలాఖరులోగా స్పష్టతనివ్వకపోతే రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల ప్రకటించింది.

ys sharmila deadline to congress

సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో షర్మిల అధ్యక్షతన వైఎస్సార్‌టీపీ రాష్ట్ర కార్యవర్గం సమవేశం జరిగింది. 33జిల్లాల నుంచి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవ్వగా, సమవేశంలో పార్టీ విలీనం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ప్రచారం నేపధ్యంలో పార్టీ నేతలు తలోదారి అన్నట్లుగా వ్యవహారిస్తుండటంతో షర్మిల కాంగ్రెస్ అధిష్టానంతో పార్టీ విలీనంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధపడ్డారు.

విలీనం సాధ్యం కాకపోతే తెలంగాణలోని 119నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నానని, పార్టీ కార్గవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసానిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన అందరికి తగిన గుర్తింపు తప్పక ఉంటుందన్నారు.

Exit mobile version