12 Face Shivalingam | 12ముఖాల అద్భుత శివలింగం..పాండు గుహ ప్రత్యేకం

రాజస్థాన్‌లోని విరాట్‌నగర్ పాండు గుహలో 12ముఖాల శివలింగం దర్శనమిచ్చిందంటా! దాని వెనుక ఉన్న పురాణ రహస్యం ఏమిటో తెలుసా?

12 Face Shivalingam

విధాత : పురాణ దివ్యక్షేత్రాలకు భారత దేశాన్ని నెలవుగా భావిస్తారు. ఎన్నో పురాణ..ఇతిహాస దివ్యగాథలు..వాటిని ప్రతిబింభించేలా కొలువైన దివ్యక్షేత్రాలు భారత వనిని పుణ్యభూమిగా..కర్మభూమిగా నిలిపాయి. అటువంటి అద్భుత దివ్యక్షేత్రంలో ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలోని విరాట్ నగర్ లో కనిపిస్తుంది. ఇక్కడ పాండు కొండలలో పాండు గుహగా పిలువబడే పురాతన కొండ గుహలో 12 ముఖాలతో రూపొందించబడిన అద్భుత అరుదైన శివలింగం..నందీశ్వరుడు కొలువై ఉండటంతో ఈ క్షేత్రం దర్శనీయ స్థలంగా విరాజిల్లుతుంది.

ఈ కొండ గుహ ప్రాంతంలో పాండవుల అరణ్యవాసంతో ముడిపడి ఉందని..ఇక్కడే ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడిపారని కథనం. 12ముఖాల శివలింగాన్ని పాండవులు తమ అరణ్యవాస కాలానికి గుర్తుగా ప్రతిష్టించి ఈశ్వరుడిని ఆరాధించి అజ్ఞాతవాసం విజయవంతంగా సాగాలని కోరుకొని ఉండవచ్చని భావిస్తుంటారు. ఆ కాలంలోనే పాండవులు ఈ గుహలో ఈ విశిష్ట శివలింగాన్ని ప్రతిష్టించి ఉంటారని నమ్ముతారు.