విధాత : వయసు పెరిగిపోతే..ముసలోళ్లయిపోయారంటూ చాలమంది కామెంట్లు చేయడం సాధారణంగా చూస్తుంటాం. మరికొందరు మాత్రం ఏజ్ కేవలం నెంబర్ మాత్రమేనని..ఫిట్నెస్ కు కాదంటూ నిరూపిస్తుంటారు. అలాంటి ఓ అద్బుతాన్ని 82ఏండ్ల బామ్మ చేసి చూపించింది. రిషికేశ్‌లో 82 ఏళ్ల మహిళ భారతదేశంలోనే ఎత్తైన బంగీ జంపింగ్ చేసింది. ఏదో సాధాసీదాగా కాదండి..బంగీ జంప్ సమయంలో యువకుల మాదిరిగా పక్షి రెక్కలు విప్పుకున్నట్లుగా తన రెండు చేతులను చాచి గాలిలో విహరిస్తూ ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ…మరి తన బంగీ జంపింగ్ ను అస్వాదించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వయస్సు, ఖచ్చితంగా కేవలం ఒక సంఖ్య మాత్రమేనంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఒలెనా బెకో అనే అనే వృద్దురాలి జీవిత చరమాంకంలో తన అభిరుచులను నేరవేర్చుకునే క్రమంలో భారత పర్యటన చేపట్టారు. ఈ క్రమంలోనే అధ్యాత్మిక ప్రాంతం ఉత్తరాఖండ్ రిషికేశ్ ను సందర్శించిన ఈ బ్రిటన్ బామ్మ రిషికేశ్‌లోని శివపురిలో ఉన్న బంగీ జంపింగ్ స్పాట్ నుంచి 117 అడుగుల ఎత్తు నుండి తన సాహసోపేత బంగీ జంప్ తో కొత్త రికార్డు సృష్టించారు.
An 82-year-old at the brink in Rishikesh. A breath. A laugh. A leap. For a few seconds, time loosens its grip—and we all remember that adventure listens to the heart, not the calendar.
So wholesome to watch ❤️#Rishikesh #BungeeJumping #AgeIsJustANumber pic.twitter.com/iQWOpNGyaC— Sanatani Soul (@SanataniKid07) October 26, 2025
