విధాత : పిల్లల కోరికలను తీర్చేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలు ఒక్కోసారి మనస్సును కదిలించేలా ఉంటాయి. తాజాగా ఓ తండ్రి తన కూతురి స్కూటర్ కలను సాకారం చేసేందుకు పడిన తపన వైరల్ గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ధన్‌తేరాస్ సందర్భంగా ఓ సంఘటన అందరి మనసులను హత్తుకుంది. బజ్రంగ్ రామ్ అనే రైతు తన కుమార్తె చంపా భగత్ స్కూటర్ కల నెరవేర్చేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆరు నెలలుగా నాణేల రూపంలో పొదుపు చేయడం ఆరంభించాడు. ధన్ తేరాస్ శుభ ముహూర్తానా ఒక సంచి నిండా నాణేలతో హోండా స్కూటర్ షోరూమ్‌కి వెళ్లాడు.
సాదాసీదాగా కనిపించే బజ్రంగ్ రామ్ స్కూటర్ కొంటానంటూ నాణేలా సంచితో రావడంతో షోరూమ్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. అతడి సంకల్పానికి ఫిదా అయిపోయి నాణేలు స్వీకరించేందుకు అంగీకరించి వాటిని లెక్కించగా రూ. 40,000గా లెక్క తేలింది. మిగిలిన మొత్తానికి లోన్ తీసుకుని బజ్రంగా రామ్ తన కూరురికి కొత్త హోండా యాక్టివాను కొనుగోలు చేశాడు. కొత్త స్కూటర్ కొనుగోలుతో కుమార్తె సంతోషం చూసి అంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
In Chhattisgarh’s Jashpur, farmer buys honda activa for daughter and paid in coins.
Bajrag Ram Bhagat saved 40 thousand rupees in coins and was finally able to gift her daughter a scooty.
What an emotional moment for the family, the video is pure love…
Jashpur is home to… pic.twitter.com/2eUKRzUA82
— Vishnukant (@vishnukant_7) October 23, 2025