న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి ప్రాంతం బహదూర్ షా మార్గ్ లో జరిగిన ఎన్ కౌంటర్ల(Delhi Encounter)లో బీహార్ కు చెందిన నలుగురు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్లు(Bihar gangsters killed) హతమయ్యారు. గురువారం ఉదయం ఢిల్లీ పోలీస్ క్రైం బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్లో బీహార్‌లోని రంజన్ పాఠక్ ముఠాకు చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను రంజన్ పాఠక్(25), బీమలేశ్ మహతో(25), మనీష్ పాఠక్(33), అమన్ ఠాకూర్(21)లుగా గుర్తించారు.
ఈ ముఠా బీహార్‌లో పలు హత్యలు, దోపిడీలు చేసింది. తాజాగా బీహార్ ఎన్నికల ముందు అక్కడ అలజడి సృష్టించేందుకు వారు కుట్రలు పన్నినట్లుగా పోలీసులు వెల్లడించారు. వారంతా బీహార్కు చెందిన సీతామర్హి ప్రాంతానికి చెందిన గ్యాంగ్ స్టర్లు కాగా.. అమన్ ఠాకూర్ స్వస్థలం కార్వాల్ నగర్. ‘సిగ్మా ఆండ్ కంపెనీ’ అని పిలువబడే ఈ గ్యాంగ్స్టర్ ముఠాకు రంజన్ పాఠక్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ నేరస్థులు బీహార్‌లో నమోదైన అనేక ప్రధాన కేసుల్లో నిందితులుగా ఉండి..పరారీలో ఉన్నారు.