Police Jobs | మీరు డిగ్రీ( Degree ) లేదా ఇంటర్( Inter ), ఐటీఐ( ITI ) పాసయ్యారా? పోలీసు కొలువుల( Police Job ) కోసం చూస్తున్నారా? అయితే ఈ ప్రకటనలు మీ కోసమే… ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్( Staff Selection Commission ) విడుదల చేసిన ఎస్ఐ( SI ), హెడ్ కానిస్టేబుల్( Head Constable ), కానిస్టేబుల్( Constable ) పోస్టుల నోటిఫికేషన్ల వివరాలు సంక్షిప్తంగా..
మొత్తం ఖాళీలు: 4362
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ఢిల్లీ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది.
ఎస్‌ఐ పోస్టులు( మొత్తం ఖాళీలు: 3073)
వీటిలో ఢిల్లీ పోలీస్‌లో ఎస్‌ఐ (పురుష-142, మహిళ- 70)-212 ఖాళీలు ఉన్నాయి. సీఏపీఎఫ్‌లోని దళాలు వారీగా ఖాళీలు – సీఆర్‌పీఎఫ్-1029, బీఎస్‌ఎఫ్-223, ఐటీబీపీ- 233, సీఐఎస్‌ఎఫ్-1294, ఎస్‌ఎస్‌బీ- 82 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు: సెంట్రల్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్), సీఏపీఎఫ్- జీడీ (పురుష, మహిళలు)
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 20- 25 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2000, ఆగస్టు 2 నుంచి 2005, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
– రాతపరీక్ష పేపర్-1, పీఎస్‌టీ/పీఈటీ, పేపర్-2, డీఎంఈ
పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 50, జీకే అండ్ జనరల్ అవేర్‌నెస్- 50, క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్-50, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్- 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు – 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ప్రతి సెక్షన్‌కు 30 నిమిషాలు.
పేపర్-2 ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
– రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
– నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 16
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్: నవంబర్, డిసెంబర్‌లో నిర్వహిస్తారు
వెబ్‌సైట్: https://ssc.gov.in
హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు(మొత్తం ఖాళీలు: 552)
వీటిలో పురుషులు-370, మహిళలు-182 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/టెలీ ప్రింటర్ ఆపరేటర్)
అర్హతలు: ఇంటర్ (సైన్స్ అండ్ మ్యాథ్స్) ఉత్తీర్ణత లేదా మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో ఐటీఐ/ఎన్‌సీటీ ట్రేడ్‌తోపాటు కంప్యూటర్ ఆపరేషన్‌లో ప్రావీణ్యం (క్వాలిఫయింగ్ నేచర్), కంప్యూటర్ ప్రాథమిక జ్ఞానం తదితరాలు
వయస్సు: 18- 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: సీబీటీ, పీఈటీ/పీఎస్‌టీ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 15
వెబ్‌సైట్: https://ssc.gov.in
కానిస్టేబుల్ పోస్టులు..(మొత్తం ఖాళీలు: 737)
పోస్టులు: కానిస్టేబుల్ (డ్రైవర్)
అర్హతలు: ఇంటర్‌తోపాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు: 21- 30 ఏండ్ల మధ్య ఉండాలి
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: అక్టోబర్ 15
వెబ్‌సైట్: https://ssc.gov.in