విధాత : అమెరికా – ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమవ్వడం పట్ల పాకిస్థాన్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కరాచీలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయంపై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఇరాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ కర్రలు, రాళ్లు, రాడ్లతో విరుచుకుపడ్డారు. కాన్సులెట్ లోనికి వెళ్తేందుకు ప్రయత్నించారు. కాన్సులెట్ కు నిప్పంటించారు.
దీంతో అమెరికా ఆర్మీ పరిస్థితిని అదుపు చేసేందుకు..అక్కడ ఉన్న అమెరికా పౌరులను రక్షించుకునేందుకు ముందుగా టియర్ గ్యాస్ ప్రయోగించింది. లాఠీఛార్జికి దిగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో అమెరికా ఆర్మీ కాల్పులు జరుపగా… 8 మంది పాక్ పౌరులు మరణించారు. కాల్పుల్లో 30మందికి పైగా నిరసనకారులకు గాయాలయ్యాయి.
మరోవైపు ఇజ్రాయిల్, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్ లో విరుచకపడుతుంది. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, దుబాయ్, ఖతార్, అబుదాబి ఏయిర్ బేస్ లపైన, సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడులకు దిగింది.
🚨Another Video:
Locals protesting Iran strikes are currently smashing windows at a U.S. consulate in Karachi, Pakistan.#Karachi #Pakistan #America @realDonaldTrump @CMShehbaz pic.twitter.com/cad2Tqcn5p— Abdul moeez (@moiz_khan7984) March 1, 2026
