Virosh | స్వగ్రామానికి విరోష్ జంట… తుమ్మనపేటలో సత్యనారాయణ వ్రతం, గ్రామస్థులకు ప్రత్యేక విందు

Virosh |  టాలీవుడ్ స్టార్ దంపతులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక త‌మ‌ వివాహానంతరం తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామాన్ని సందర్శించనున్నారు. మార్చి 2వ తేదీ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామానికి నూతన దంపతులుగా వెళ్లనున్నట్లు సమాచారం.

Virosh |  టాలీవుడ్ స్టార్ దంపతులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక త‌మ‌ వివాహానంతరం తొలిసారిగా విజయ్ తండ్రి స్వగ్రామాన్ని సందర్శించనున్నారు. మార్చి 2వ తేదీ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం, తుమ్మనపేట గ్రామానికి నూతన దంపతులుగా వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివాహానంతర సంప్రదాయాల్లో భాగంగా పూజలు

వివాహం తర్వాత పూర్వీకుల గ్రామాన్ని సందర్శించడం కుటుంబ సంప్రదాయాల్లో ఒకటిగా భావిస్తారు. అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ జంట తుమ్మనపేటలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించనున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వ్రతం జ‌ర‌గ‌నుంది. కొత్త జీవితానికి శుభారంభం కలగాలని దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

గ్రామస్థులకు ప్రత్యేక విందు

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామస్థుల కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో గ్రామ ప్రజలతో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని విరోష్ జంట నిర్ణయించుకున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. గ్రామంలో ఇప్పటికే శుభ్రత, భద్రత, ఇతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. తమ గ్రామానికి చెందిన యువకుడు జాతీయ స్థాయిలో స్టార్‌గా ఎదిగి, పెళ్లి అనంతరం స్వగ్రామానికి రావడం గ్రామస్థుల్లో ఆనందాన్ని నింపుతోంది.

ఉదయ్‌పూర్‌లో   వివాహం

ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో విజయ్–రష్మికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు,కొడవ సంప్రదాయాల ప్రకారం రెండు విధాలుగా పెళ్లి వేడుకలు నిర్వహించారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఈ జంట హైదరాబాద్‌కు చేరుకుని అభిమానుల ఆశీస్సులు అందుకున్నారు.

హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్

స్వగ్రామ పర్యటన అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ మిత్రులు, రాజకీయ ప్రముఖులు మరియు ఇతర ఆహ్వానితుల కోసం ఘన రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుక టాలీవుడ్‌లో మరో పెద్ద ఈవెంట్‌గా నిలవనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. వివాహానంతరం సంప్రదాయాలను పాటిస్తూ పూర్వీకుల గ్రామాన్ని సందర్శించడం, గ్రామస్థులతో ఆనందాన్ని పంచుకోవడం ద్వారా విరోష్ జంట తమ మూలాలను మరవలేదని మరోసారి నిరూపిస్తోంది.

Latest News