Indian Railway | ప్రయాణ సమాయానికి ముందు టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత టికెట్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. మొదట టికెట్ బుక్ చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు చెల్లించే అవకాశం కల్పిస్తున్నది. ప్రస్తుతం చాలామంది ఇంట్లో వస్తువులను కొనుగోలు చేసి.. ఆ తర్వాత డబ్బులు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ‘బై నౌ పే లేటర్’ తరహాలో ట్రావెల్ నౌ పే లేటర్ (TN PL) పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ అవకాశం కల్పిస్తున్నది. ప్రయాణం కోసం అత్యవసర సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునే సమయంలో అకౌంట్లలో డబ్బులు లేని సమయంలో ఇబ్బందులుపడాల్సి వస్తుంది.
ఈ క్రమంలో ముందు ప్రయాణించి, ఆ తర్వాత డబ్బులు చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నది. ఇందు కోసం క్యాష్ ఈ, పేటీఎం, ఈ పే లేటర్ సంస్థలతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకున్నది. పేటీఎంతో ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన్ అయ్యాక ప్రయాణ వివరాలను నమోదు చేసి.. టికెట్ బుకింగ్‌పై క్లిక్ చేయాలి. పేమెంట్ సెక్షన్‌లో పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. అందులో పేటీఎం పోస్ట్‌పేయిడ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. పేటీఎం లాగిన్ వివరాలు ఇచ్చి.. ఓటీపీని ఎటర్ చేయాలి. ఆ తర్వాత టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. క్యాష్-ఈలో చేయాలనుకుంటే.. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
ప్రయాణం తేదీ, ప్రయాణికుల వివరాలు అన్నీ నమోదు చేశాక బుక్ టికెట్‌పై క్లిక్ చేసి.. పేమెంట్ ఆప్షన్‌లో టీఎన్‌పీఎల్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి, క్యాష్-ఈ సెలెక్ట్ చేయాలి. లాగిన్ వివరాలతో పాటు ఓటీపీ ఎంటర్ చేస్తే టికెట్ బుకింగ్ అవుతుంది. ఈ విధానంలో బుకింగ్ సొమ్మును ఈఎంఐ కింద మూడు నుంచి ఆరు నెలలల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నది. ఫిన్‌టెక్ సంస్థ సైతం ఈ పేలేటర్ సదుపాయం కల్పిస్తున్నది. టికెట్ బుక్ చేసుకున్న రోజు నుంచి 14రోజుల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. గడువు దాటితే 36శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందనే విషయం మరిచిపోవద్దు.