న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్ పై దాడి ప్రయత్నం కలకలం రేపింది. ఓ కేసు విచారణ కొనసాగుతున్న సమయంతో న్యాయవాది కిశోర్ రాకేష్ సీజేఐ గవాయ్ పైకి తన బూటు విసిరాడు. తోటి న్యాయవాదులు దాడిని అడ్డుకున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది న్యాయవాది కిశోర్ రాకేష్ ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కిషోర్ రాకేష్ సనాతన ధర్మాన్ని విస్మరిస్తున్నారంటూ నినాదాలు చేశారు.
దాడి యత్నంపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ…ఇలాంటి చర్యలు నాపై ప్రభావం చూపలేవు అన్నారు. ఇతర న్యాయవాదులు తమ వాదనలు కొనసాగించండి అని సూచించారు. లాంటి దారులకు భయపడేది లేదు అని స్పష్టం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.