బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్ర : కవిత తీవ్ర ఆరోపణలు

ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్‌లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్నారు.

Kavitha

విధాత, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్ లాగ్ పోస్టులను అమ్ముకునే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన నిరుద్యోగుల నోట్లోనే మట్టి కొడుతున్నారు అని ఆరోపించారు. ఈనెల 9, 10 తేదీల్లో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో దొడ్డిదారిన బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామకాలకు ప్రయత్నాలు చేస్తున్నారు అని.. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల బ్యాక్ లాగ్ పోస్టులు అని పేర్కొన్నారు. అవన్ని కూడా గతంలో రిక్రూట్ చేయకుండా ఉన్న పోస్టులే అని వెల్లడించారు. వాటిని గతంలో బీఆర్ఎస్ హయాంలో చేసినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఒక్కో ఉద్యోగానికి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. దీంతో ఎన్నో వ్యయప్రయాసాలతో పోటీ పరీక్షల కోచింగ్ లు తీసుకుని ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 44 బ్యాక్ లాగ్ పోస్టులను లక్షలాది రూపాయకు అమ్ముకోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ఆనాడు నిరుద్యోగులకు అన్యాయం చేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారన్నారు. బ్యాక్ డోర్ లో బ్యాక్ లాగ్ పోస్టుల రిక్రూట్మెంట్ ప్రయత్నాలను జిల్లాల కలెక్టర్లు అడ్డుకోవాలని, పద్దతిగా రిక్రూట్మెంట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ విషయంలో తక్షణమే మేల్కోని అక్రమ నియామకాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Raja Saab | ఓటీటీలోనూ ‘రాజా సాబ్’కి రిలీఫ్ లేదు… ట్రోల్స్‌తో మళ్లీ హాట్ టాపిక్!
Feeding Pigeons | పావురాల‌కు దాణా వేసి కోర్టు ఆగ్ర‌హానికి గురైన భార‌త సంత‌తి వృద్ధురాలు.. భారీ ఫైన్‌

Latest News