• Telugu News
  • /Telangana

Telangana Police | తెలంగాణ పోలీసుల‌కు శుభ‌వార్త‌.. బ‌ర్త్‌డే, మ్యారేజ్ డేకు సెల‌వులు

Telangana Police | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పోలీసుల‌కు శుభ‌వార్త వినిపించింది. శాంతి భ‌ద్ర‌త‌ల్లో రాత్రింబ‌వ‌ళ్లు నిమగ్న‌మై ఉండే పోలీసులు త‌మ కుటుంబాల ప‌రిధిలో జ‌రిగే శుభ‌కార్యాల‌కు చాలా త‌క్కువ‌గా హాజ‌ర‌వుతుంటారు.

Reported by: raj | తెలంగాణ‌ | Apr 27, 2026, 7:24 pm IST
Read Time: 2 mins
Telangana Police | తెలంగాణ పోలీసుల‌కు శుభ‌వార్త‌.. బ‌ర్త్‌డే, మ్యారేజ్ డేకు సెల‌వులు

Telangana Police | తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం పోలీసుల‌కు శుభ‌వార్త వినిపించింది. శాంతి భ‌ద్ర‌త‌ల్లో రాత్రింబ‌వ‌ళ్లు నిమగ్న‌మై ఉండే పోలీసులు త‌మ కుటుంబాల ప‌రిధిలో జ‌రిగే శుభ‌కార్యాల‌కు చాలా త‌క్కువ‌గా హాజ‌ర‌వుతుంటారు. చివ‌ర‌కు త‌మ పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుక‌ల‌కు కూడా దూరంగా ఉండి, శాంత్రి భ‌ద్ర‌తల్లో మునిగిపోతారు.

ఇలా 24 గంట‌ల పాటు విధుల్లో ఉండే పోలీసుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌తి పోలీసు త‌మ పుట్టిన రోజు నాడు, పెళ్లి రోజు నాడు సెల‌వు తీసుకోవ‌చ్చు అని డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఈ ఉత్త‌ర్వులు వెలువ‌డిన నేప‌థ్యంలో పోలీసులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి నిర్ణ‌యం పట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నారు.