Telangana Cabinet | మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ.. ఆర్టీసీ సమ్మెకు ఎండ్ కార్డు పడేనా..?
Telangana Cabinet | తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
Telangana Cabinet | తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరంపై హైకోర్టు తీర్పుపై ప్రధానంగా చర్చించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇక ఆర్టీసీ సమ్మెపై కూడా సీఎం రేవంత్ సంబంధిత అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. కార్మికుల డిమాండ్లపై చర్చించి సాయంత్రానికి మంత్రివర్గం ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో సమ్మెకు ఇవాళనే శుభం కార్డు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మె వల్ల రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram