మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 421 సార్లు మోదీ విద్వేష వ్యాఖ్యలు..758 సార్లు స్వనామ స్మరణ ..గెలిచేది ఇండియా కూటమే: ఖర్గే

మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో 421 సార్లు మోదీ విద్వేష వ్యాఖ్యలు..758 సార్లు స్వనామ స్మరణ ..గెలిచేది ఇండియా కూటమే: ఖర్గే

  • Publish Date - May 30, 2024 / 09:30 PM IST

  • 421 సార్లు మోదీ విద్వేష వ్యాఖ్యలు
  • 758 సార్లు స్వనామ స్మరణ
  • గెలిచేది ఇండియా కూటమే
  • ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శ

న్యూఢిల్లీ :  4లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో21 సార్లు ప్రధాని మోదీ విద్వేష అంశాలను ఉపన్యాసాల్లో ప్రస్తావించారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగవద్దని ఎన్నికల సంఘం చెప్పినప్పటికీ ప్రధాని 421 సార్లు మందిర్‌, మసీద్‌, తదితర విభజనపూరిత అంశాలను లేవనెత్తారని ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. గత పదిహేను రోజుల వ్యవధిలోనే మోదీ తన పేరును 758 సార్లు, కాంగ్రెస్‌ పేరును 232 సార్లు ప్రస్తావించారని తెలిపారు. ఉపన్యాసాల్లో ఎక్కడా నిరుద్యోగం గురించి మాట్లాడిన పాపానపోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని, దేశానికి సమ్మిళిత, జాతీయతత్వంతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తుందని స్పష్టంచేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం మళ్లీ ఎన్నికైతే అది ప్రజాస్వామ్యానికి ముగింపే అవుతుందనే తమ భావనను ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. 1982లో గాంధీ సినిమా విడుదలయ్యేంత వరకూ గాంధీ ఎవరో ప్రపంచానికి తెలియదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన చురకలు వేస్తూ.. ‘ప్రధాని గాంధీ గురించి చదువుకోలేదోమో.. కానీ.. మహాత్మా యావత్‌ ప్రపంచానికి తెలుసు’ అన్నారు.

Latest News