Naveen Yadav | న‌వీన్ యాద‌వ్ చేతిలో న‌గ‌దు రూ. 4 ల‌క్ష‌లు.. అప్పులు రూ. 75 ల‌క్ష‌లు..!

Naveen Yadav | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubleehills By Poll ) కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్( Naveen Yadav ) వ‌ద్ద కేవ‌లం రూ. 4 ల‌క్ష‌ల న‌గ‌దు ఉంద‌ని త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. అప్పులు మాత్రం రూ. 75 ల‌క్ష‌లు ఉన్నాయ‌ని, ఏడు క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు.

Naveen Yadav | హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక( Jubleehills By Poll ) నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) త‌ర‌పున పీ న‌వీన్ యాద‌వ్( Naveen Yadav ) రెండు రోజుల క్రితం నామినేష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భారీ ర్యాలీ నిర్వ‌హించారు. ఇక నామినేష‌న్ ప‌త్రాల్లో కీల‌క‌మైన అఫిడ‌విట్ ప్ర‌కారం.. న‌వీన్ యాద‌వ్ చేతిలో కేవ‌లం రూ. 4 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. అప్పులు మాత్రం రూ. 75 ల‌క్ష‌లు ఉన్న‌ట్లు చూపించారు. త‌న భార్య చేతిలో కేవ‌లం రూ. 2 ల‌క్ష‌ల న‌గ‌దు ఉన్న‌ట్లు లెక్క‌లు చూపించారు.

న‌వీన్ యాద‌వ్ పేరిట ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ. 37.6 ల‌క్ష‌లు, భార్య పేరిట ఉన్న రెండు ఖాతాల్లో రూ. 10 వేలు నిల్వ ఉన్న‌ట్లు పేర్కొన్నారు. త‌న పేరు మీద స్కోడా కారు, భార్య పేరు మీద హుందాయ్ ఐ10 కారు ఉన్న‌ట్లు పేర్కొన్నారు. రూ. 7 ల‌క్ష‌ల విలువైన షేర్లు ఉన్నాయ‌న్నారు. న‌వీన్ యాద‌వ్ వ‌ద్ద 11 తులాల బంగారం, భార్య వ‌ద్ద 2 కేజీల బంగారంతో పాటు 15 కిలోల వెండి ఉంద‌ని తెలిపారు.

ఇక భూముల విష‌యానికి వ‌స్తే.. న‌వీన్ యాద‌వ్ పేర 14.39 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి, యూసుఫ్‌గూడ‌లో 860 గ‌జాల ఇంటి స్థ‌లం, భార్య పేర 4.30 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి, 466 గ‌జాల స్థ‌లంలో ఇళ్లు ఉన్నాయ‌ని త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ. 29.66 కోట్లు క‌గా, భార్య పేర రూ. 5.75 కోట్లు ఉన్నాయ‌న్నారు. ఇక త‌న మీద ఏడు క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు న‌వీన్ యాద‌వ్ స్ప‌ష్టంగా పేర్కొన్నారు.