హైదరాబాద్‌లో క్యారట్‌లేన్‌ నూతన షోరూం ప్రారంభం.. వజ్రాలపై 30% రాయితీ!

హైదరాబాద్‌, జులై 21, 2025: ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌ క్యారట్‌లేన్‌, హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తన సరికొత్త స్టోర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇది 329వ స్టోర్‌ కాగా, హైదరాబాద్‌లో 19వది. సువిశాలమైన 1400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో అధునాతన డిజైన్లతో కూడిన ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి క్యారట్‌లేన్‌ రీజినల్‌ మేనేజర్‌ నవదీప్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, తమ వ్యాపార భాగస్వాములు మల్లికార్జున్‌, సీతారామ్‌లతో కలిసి స్టోర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా, క్యారట్‌లేన్‌ వజ్రాభరణాలపై 30 శాతం భారీ రాయితీని ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌ జులై 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన వజ్రాలను సరసమైన ధరల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని క్యారట్‌లేన్‌ తెలియజేసింది.