Site icon vidhaatha

kavitha: కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారా… కాంగ్రెస్ ఎంపీ సమాధానం ఇదే..

kavitha: విధాత, ఢిల్లీః  కాంగ్రెస్ పార్టీకి కల్వకుంట్ల కవిత అవసరం లేదని ఎంపీ చామల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీకి బలమైన నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న విషయం కవిత వ్యాఖ్యలతోనే రుజువైందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

తాము ఎన్నో రోజుల నుంచి చెబుతున్న విషయాలను కవిత ఇప్పుడు చెప్పిందని పేర్కొన్నారు. లేఖలు, లీకులు కాకుండా కవిత కేసీఆర్ అవినీతి మీద కూడా మాట్లాడాలని పేర్కొన్నారు. అవినీతికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ వల్లే బీజేపీకి గత పార్లమెంటు ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మరోసారి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో కవిత బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

కవిత వ్యాఖ్యలతో కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను కలపాలని ఆయన చూసినట్లు బయటపడిందని అన్నారు. కేసీఆర్ ఎందుకు బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారో కవిత బయట పెట్టాలని బీర్ల ఐలయ్య కోరారు. కేటీఆర్ బండారాన్ని కవిత బయట పెట్టిందని చెప్పుకొచ్చారు.

 

Exit mobile version