Site icon vidhaatha

ఎస్‌వి ప్రసాద్ మృతి పట్ల గవర్నర్ విచారం

విధాత:సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.వి.ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీయుత బిశ్వభూషణ్ హరి చందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రసాద్ అకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటన్నారు. ముందు చూపు కలిగిన మంచి అధికారిగా సమైఖ్య రాష్ట్ర పాలనా వ్యవహారాలలో చెరగని ముద్ర వేసారని గౌరవ గవర్నర్ ప్రస్తుతించారు.

సగటు ప్రజలకు సైతం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో విధులు నిర్వహించిన అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారని కొనియాడారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా , విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్ అందించిన సేవలు నిరుపమానమని, ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్ అర్ టి సి ఎండీ, వైస్‌చైర్మన్‌గా ఆయా సంస్థల బలోపేతం కోసం కృషి చేశారన్న గవర్నర్ ఎస్వీ ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. కుటుంబసభ్యులకు హారిచందన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

Exit mobile version