Site icon vidhaatha

పోస్టల్ ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం

విధాత:భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ బేసిస్ పై తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించేందుకు కావాల్సిన ఏజెంట్ల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ నగర తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ రిప్పన్ డల్లెట్ తెలియజేశారు. 10 వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న హైదరాబాద్ నగరానికి చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

ఆసక్తి కలిగినవారు పూర్తి చేసిన దరఖాస్తులను అబిడ్స్ లోని హైదరాబాద్ నగర తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ డివిజనల్ కార్యాలయంలో జులై 23వ తేదీ లోపు అందజేయాలన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులు జులై 29, 30 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ కు హాజరు కావాలి. ఏజెంటుగా నియమితులైనవారు సెక్యూరిటీ డిపాజిట్ గా 5000/- రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు సమీపంలోని తపాలా శాఖ సిబ్బందిని సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు. దరఖాస్తులను కింద తలిపిన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలరని తెలిపారు.

Exit mobile version