CBI Arrests NHIDCL Executive Director | అక్రమాస్తుల కేసులో నేషనల్ హైవే అధికారి అరెస్టు

నేషనల్ హైవేస్ అధికారి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాయిస్నమ్ రిటెన్ కుమార్ సింగ్‌ను అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసింది. సోదాల్లో ₹2.62 కోట్లు, స్థిరాస్తుల పత్రాలు, ఆరు లగ్జరీ వాహనాలు స్వాధీనం చేసుకుంది. ఇతన్ని ₹10 లక్షల లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు.

2.6 crore cash, luxury cars, watches recovered from NHIDCL official in Guwahati

విధాత : నేషనల్ హైవేస్ ఆండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గౌహతి ప్రాంతీయ కార్యాలయం (NHIDCL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రీజినల్ ఆఫీసర్ మాయిస్నమ్ రిటెన్ కుమార్ సింగ్ ను సీబీఐ అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది. ఆయన కార్యాలయం, నివాస ప్రాంగణంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. అక్టోబర్ 14న ఒక ప్రైవేట్ వ్యక్తి నుండి రూ. 10 లక్షల లంచం తీసుకుంటుండగా సీబీఐ ఆయనను అరెస్టు చేసింది.

గౌహతి, ఘజియాబాద్, ఇంఫాల్‌లలో జరిగిన సోదాల తర్వాత సీబీఐ రూ. 2.62 కోట్లు, ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, గౌహతిలోని స్థిరాస్తులలో పెట్టుబడికి సంబంధించిన పత్రాలు, ఇంఫాల్ వెస్ట్‌లో 2 ఇంటి స్థలాలు, 1 వ్యవసాయ భూముల పత్రాలను సీబీఐ బృందం స్వాధీనం చేసుకుంది. ఆరు హై-ఎండ్ లగ్జరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పెట్టుబడికి సంబంధించిన పత్రాలు, లక్షల విలువైన 2 లగ్జరీ గడియారాలు, 00 గ్రాముల సిల్వర్ బార్‌ను స్వాధీనం చేసుకున్నారు.