ఆక్సిజ‌న్ కోసం ఎమ్మెల్యే జొన్నలగడ్డ విరాళం

విధాత‌: ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని అనంత‌పురం జిల్లా, శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న ‘స్పందించు- ఆక్సిజన్ అందించు‘ అనే కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. శింగనమల ఎమ్మెల్యే పద్మావతి తన ఒక నెల జీతాన్ని విరాళంగా అంద‌జేశారు.అలాగే ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు 3లక్షల 35వేల రూపాయల‌రె ఆర్డీటీ హెడ్ మాంచో ఫెర్రర్‌కు అందజేశారు.ఎమ్మెల్యే మాతృమూర్తి జొన్నలగడ్డ నిర్మలాదేవి తన […]

  • Publish Date - May 6, 2021 / 01:04 PM IST

విధాత‌: ఆక్సిజ‌న్ కొర‌త తీర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని అనంత‌పురం జిల్లా, శింగనమల ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి పిలుపునిచ్చారు. రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న ‘స్పందించు- ఆక్సిజన్ అందించు‘ అనే కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. శింగనమల ఎమ్మెల్యే పద్మావతి తన ఒక నెల జీతాన్ని విరాళంగా అంద‌జేశారు.అలాగే ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు 3లక్షల 35వేల రూపాయల‌రె ఆర్డీటీ హెడ్ మాంచో ఫెర్రర్‌కు అందజేశారు.ఎమ్మెల్యే మాతృమూర్తి జొన్నలగడ్డ నిర్మలాదేవి తన రెండు నెలల పెన్షన్‌, దాతలు అంద‌జేసిన 3,35,000 రూపాయ‌ల‌ను ఆర్డీటీకి అందజేశారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ క‌రోనా క్లిష్ట సమయంలో ఆర్డీటీ సేవలు ప్రశంసనీయమన్నారు. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌న్నారు. అత్యవసరం అయితే నియోజకవర్గ కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ 9121913939 లేదా 9121914949 ఫోన్ చేయాల‌ని సూచించారు. మీకు అవసరమైన సహాయాన్ని అందిస్తామ‌ని వారు తెలిపారు.