Site icon vidhaatha

Mulugu | వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు

mulugu-flood-ndrf-rescue

బాధితలును కాపాడిన ఎన్డీఆర్ఎఫ్
ములుగు జిల్లాలో అర్ధరాత్రి సంఘటన

Mulugu | విధాత, ఆగస్టు 19, ములుగు: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాలువపల్లిలో వరదలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను ఎన్టీడీఆర్ఎఫ్ బృందం సురరక్షితంగా కాపాడింది.దీంతో వారి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. సోమవారం పశువులను మేపేందుకు వెళ్ళిన దుబారి రామయ్య, చేపలు పట్టుటకు వెళ్ళిన సాయికిరణ్, రాజబాబు, రాములు సాయంత్రమైనా ఇంటికి రాలేదు. పైగా వాగు ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈక్రమంలో రామయ్య సోదరుడు స్థానిక తహసిల్దార్ సురేష్ బాబుకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన జిల్లా కలెక్టర్ దివాకర్కు వివరించారు. కలెక్టర్ రాత్రి 11 గంటలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించారు.

ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వంలో ఎన్టీఆర్ఎఫ్ బృందం ఘటన స్థలానికి చేరుకొని తాడు సహాయంతో వాగు దాటి రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వాగు నుండి కిలో మీటర్ దూరంలో ఉన్న సాయికిరణ్, రాజాబాబు, రాములను గుర్తించి వారిని రక్షించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ నుండి ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్, ఏఎస్ఐ సుధీర్, సురేందర్, హెడ్ కానిస్టేబుల్ జగదీష్, చంద్ర, రమేష్, కానిస్టేబుల్ ఆనంద్, రమణమూర్తి, విశాల్ బృందం, తహసిల్దార్ సురేష్ బాబు, ఎం పి ఓ శ్రీధర్, డిఈఈ సదయ్య, ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి, ఏఈ రాజ పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసుల కృషికి స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Exit mobile version