Proddaturu Dasara: ఆ ఊరి.. ద‌స‌రా పండుగ‌పై డాక్యుమెంట‌రీ! అదిరిపోయిందిగా

ప్రొద్దుటూరులో జరిగే దసరా వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీ ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం మ‌ర్డ‌ర్స్‌పై, ఎంతో ఘ‌న‌త సాధ‌ఙంచిన వ్య‌క్తులు, ఘ‌ట‌న‌ల‌పై డాక్యుమెంట‌రీలు చూశాం కానీ ఫ‌స్ట్‌ టైం తెలుగులో ఓ ప్ర‌ఖ్యాత పండుగ‌పై డాక్యుమెంట‌రీ తొలిసారి తెర‌కెక్కింది. అదికూడా రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో కావ‌డం విశేషం.

ప్రొద్దుటూరులో దసరా అంటే ఓ పండుగ కాదు, ఓ సంబరాల జాతర! ఈ సాంప్రదాయ వైభవాన్ని అందరికీ చూపించాలన్న ఉద్దేశ్యంతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించిన ప్రత్యేక డాక్యుమెంటరీ “ప్రొద్దుటూరు దసరా” పేరుతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో, నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభిస్తోంది.

ఇప్పుడు ఈ అద్భుతమైన దసరా డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 7 నుంచి మీరు ఇంటి వద్దే ఈ ఉత్సవాన్ని ఆస్వాదించవచ్చు. సుమారు 40 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాల ప్రత్యేకతను అందంగా చూపించారు. ఈ రోజు లేదా రేపు మీకు సమయం దొరికితే.. ఒకసారి “ప్రొద్దుటూరు దసరా” డాక్యుమెంటరీని చూడండి మీకు ఆ పట్టణం పండుగ గాలి తాకినట్లే అనిపిస్తుంది!