Site icon vidhaatha

Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాట.. హాస్పిటల్ నుంచి శ్రీతేజ్ డిశ్చార్జ్! కానీ

పుష్ప-2 సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన గాయపడిన శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. గత ఏడాది డిసెంబర్ 4న పుష్ప-2 రిలీజ్ సందర్భంగా, సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ అప్పటి నుంచి ఆస్పత్రిలోనే  చికిత్స పొందుతున్నాడు. తాజాగా కుటుంబసభ్యులు శ్రీతేజ్ ను హాస్పిటల్ నుంచి రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.

శ్రీతేజ్ ప్రస్తుతం కళ్లు తెరిచి చూస్తున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న తండ్రి తెలిపాడు.  శ్రీతేజ్ ఇంకా నోటి ద్వారా ఆహారం, మందులు తీసుకోలేని స్థితిలో ఉన్నాడని 15-20 రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించి ఇంటికి తీసుకెళ్తామని వెల్లడించాడు. ఇందుకు సంబంధఇంచిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాాల్లో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version