మెస్సీ రాక కోసం క్రీడాభిమానులు ఎదురు చూపులు

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో మూడు రోజుల్లో ఇండియా కు రానున్నారు. మూడు రోజుల పాటు గోట్ ఇండియా టూర్ 2025 జరగనున్నది. కొలకత్తా లోని వీధులతో పాటు ముంబై మహా నగరం స్టేడియంలో, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉదయం కొలకత్తా, సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, డిసెంబర్ 14న ముంబై, చివరన 15వ తేదీ న్యూఢిల్లీలో పర్యటన ఉండనున్నది.

 

విధాత: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మరో మూడు రోజుల్లో ఇండియా కు రానున్నారు. మూడు రోజుల పాటు గోట్ ఇండియా టూర్ 2025 జరగనున్నది. కొలకత్తా లోని వీధులతో పాటు ముంబై మహా నగరం స్టేడియంలో, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కూడా మెస్సీ ఫుట్ బాల్ ఆడనున్నారు. డిసెంబర్ 13న ఉదయం కొలకత్తా, సాయంత్రం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం, డిసెంబర్ 14న ముంబై, చివరన 15వ తేదీ న్యూఢిల్లీలో పర్యటన ఉండనున్నది.

దేశంలో తొలిసారి నాన్ క్రికెట్ మెగా ఈవెంట్ అయిన గోట్ ఇండియా టూర్ కోసం క్రీడా ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం ఫుట్ బాల్ మ్యాచ్ మాత్రమే కాదని, యువ క్రీడాకారుల కోసం ఫుట్ బాల్ క్లినిక్, సెలెబ్రిటీల మ్యాచ్, మెస్సీ మాస్టర్ క్లాసులు ఉండనుండంతో డిమాండ్ పెరిగింది.

ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న సాయంత్రం 7 గంటలకు ఈవెంట్ జరగనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నారు. రేవంత్ రెడ్డి ఆర్ఆర్9 టీమ్ జెర్సీ ధరించనుండగా, మెస్సీ లియోనెల్ మెస్సీ 10 జెర్సీ పేరుతో ఆడనున్నారు. ఈవెంట్ కోసం ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఫుట్ బాల్ పోటీ నిర్వహించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ కు గుర్తింపు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశ్యమని అంటున్నారు.

ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రపంచ పారిశ్రామికవేత్తలను రప్పించేలా చేశారు. అయితే నాలుగు నగరాల్లో జరిగే టికెట్ల కోసం క్రీడాభిమానులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. జోమాటో యాప్ లో వేగంగా టికెట్ల విక్రయం జరుగుతోంది. గూగుల్ సెర్చింజన్ లో మెస్సీ ఇండియా టికెట్స్ 2025, మెస్సీ ఇండియా టూర్ డేట్స్, మెస్సీ వీఐపీ పాస్, మెస్సీ లైవ్ ఇన్ ఇండియా పేరుతో భారతీయ ఫుట్ బాల్ ప్రేమికులు వెతుకుతుండడం విశేషం. కొలకత్తాలో రూ.4,366, హైదరాబాద్ లో రూ.3,250, ముంబై లో రూ.7,670, ఢిల్లీ 4,720 చొప్పున ఖరారు చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. వీవీఐపీ, ప్రీమియం స్టాండింగ్ జోన్స్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. మెస్సీని దగ్గరి నుంచి చూసేందుకు ఈ టికెట్లు విక్రయిస్తున్నారు. అయితే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

Latest News