Site icon vidhaatha

Mahesh Goud: తెలంగాణ కాంగ్రెస్ సార‌థి.. మహేష్ కుమార్ గౌడ్‌కు కరాటే బ్లాక్ బెల్ట్!

Mahesh Goud | Karate

విధాత : పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి.మహేష్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాదు..మార్షల్ ఆర్ట్స్ లోనూ సత్తా చాటాడు. వెస్ట్‌ మారేడ్‌పల్లిలోని వైడబ్ల్యూసీఏలో 3గంటల పాటు కరాటే పరీక్షలో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ సాధించాడు. కరాటేలో మహేష్ కుమార్ గౌడ్ ప్రదర్శన పట్ల సంతృప్తి చెందిన ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆయనకు బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ ప్రధానం చేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కరాటే ప్రదర్శన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు వామ్మో మనోడు ఐదు పదుల వయసులోనూ కరాటేలో కుమ్మేస్తున్నాడని అభినందిస్తున్నారు. మరికొందరు రాజకీయాల్లోనే కాదు..కరాటేలోనూ ప్రత్యర్థులపై మహేష్ విజృంభన నడుస్తోందని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

విద్యార్థి దశ నుంచీ కరాటేలో ప్రావీణ్యం ఉన్న మహే్‌షగౌడ్‌.. టీపీసీసీ చీఫ్‌ అయిన తర్వాత కూడా ప్రాక్టీస్‌ చేస్తూనే ఉన్నారు. బ్లాక్‌ బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ పొందిన అనంతరం మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ..కరాటే తన జీవితంలో ఒక భాగంగా మారింది అని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు.. పిల్లలను కంప్యూటర్‌ కిడ్స్‌లా తయారు చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతో పాటుగా క్రీడల పట్ల పిల్లలకు ఆసక్తి కలిగించాలని, శారీరక ఆరోగ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమన్నారు. తాను ఎంత బిజీగా ఉన్నా కరాటేకు తప్పకుండా సమయం కేటాయిస్తానన్నారు. కరాటే అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ఉపాధ్యక్షుడిగా కరాటే పోటీల నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కరాటే బ్లాక్‌బెల్ట్‌ డాన్‌ 7 సర్టిఫికెట్‌ను తీసుకోవడం తనకు గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. కరాటే పోటీల్లో భాగంగా తాను పలు దేశాల్లో పర్యటించానన్నారు. ఆసియా కరాటే పోటీలను 2027లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Exit mobile version