విధాతహైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బంద్ నేపథ్యంలో ఉదయం నుండే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతిస్తూ స్వచ్ఛంగా మూసివేశారు. కేవలం ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలు పోటా పోటీగా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. అక్కడక్కడా చిన్న చిన్న ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బీసీ బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెంగుళూరు హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరసనలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు నిరసనలో పాల్గొనగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.