Nizamabad Constable Murder : నేరస్తుడి దాడిలో కానిస్టేబుల్ మృతి..మరో కానిస్టేబుల్ కు గాయాలు

నిజామాబాద్‌లో పాత నేరస్తుడు రియాజ్‌ను బైక్‌పై తీసుకెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై అతను కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందగా, మరో కానిస్టేబుల్ విఠల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సహాయానికి ఎవరూ ముందుకు రాకపోవడం విమర్శలకు దారితీసింది.

Constable stabbed to death by accused in Telangana’s Nizamabad

విధాత : పాత నేరస్తుడిని పట్టకుని బైక్ పై తీసుకెలుతున్న క్రమంలో అతని కత్తిదాడికి గురై ఓ కానిస్టేబుల్ మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పరారీలో ఉన్న పాత నేరస్తుడు రియాజ్ ను పట్టుకుని అతడిని కానిస్టేబుల్స్ ఇద్దరు తమ బైక్ పై కూర్చోబెట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు రియాజ్ వారి నుంచి తప్పించుకునే క్రమంలో తన వద్ద దాచుకున్న కత్తితో మార్గమధ్యలో కానిస్టేబుల్స్ పై ఆకస్మికంగా దాడికి దిగాడు.

కత్తిదాడిలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ మృతి చెందగా..మరో కానిస్టేబుల్ విఠల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారికి కొద్ది దూరంలో ఉన్న స్థానిక ఎస్ ఐ వెంటనే వచ్చి రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న కానిస్టేబుల్స్ ను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ మార్గంలో వెలుతున్న వాహనాదారులు, ఆటోవాళ్లు కూడా చూసి వెళ్లారే తప్పా..సహాయానికి ముందుకు రాకపోవడం విమర్శలకు దారితీసింది. జనం రక్షణ కోసం పనిచేసే కానిస్టేబుల్స్ హత్య జరుగుతున్నప్పుడు కాపాడకుండా ఫోన్ లో వీడియోలు తీస్తున్నారని పోలీస్ అధికారులు సమాజం తీరుపై మండిపడ్డారు. వినాయక నగర్‌ ప్రాంతంలో పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ రియాజ్‌ను బైక్‌పై పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.