They Call Him OG OTT Release | పవన్ కల్యాణ్ ఓజీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (OG) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అక్టోబరు 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

They Call Him OG OTT release

విధాత: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారైంది. ఈ నెల 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఓజీ మూవీ స్ట్రీమింగ్ కానుంది. పదేళ్ల క్రితం ముంబయిలో వచ్చిన తుఫాను.. మళ్లీ తిరిగి వస్తున్నాడు’ అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు పలు భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్టు పేర్కొంది.

పవన్‌ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఓజీ మూవీ సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన మంచి కలెక్షన్లను రాబట్టింది. చాల గ్యాప్ తర్వాత పవన్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు. ఓజస్‌ గంభీరగా పవన్‌.. తన అభిమానుల్లో జోష్‌ నింపారు. గ్యాంగ్ స్టర్ ఆయన నటను అభిమానులను పాత పవన్ ను గుర్తుకు తెచ్చింది. సినిమాలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్ గా నటించగా..ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషించారు.