లైలా డిజాస్టర్‌తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతి రత్నాలు అనుదీప్‌తో ‘ఫంకీ’ అనే మూవీ చేస్తున్నాడు. లేటెస్ట్ సెన్షేషన్ కయాదు లోహర్ కథానాయికగా చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా తాజాగా విశ్వక్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టీ టౌన్‌లో వినిపిస్తోంది.
అయితే ఈ సినిమాను సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ నిర్మించనుండడం విశేషం. సినిమా పేరు ‘కల్ట్’ గా ప్రచారంలో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.